IRCTC Valentine Special Tour | ఐఆర్సీటీసీ టూరిజం (IRCTC Tourism) వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.
1. వాలెంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఐఆర్సీటీసీ టూరిజం (IRCTC Tourism) వాలెంటైన్స్ డే స్పెషల్ థాయ్‌ల్యాండ్ టూర్ (Thailand Tour) ప్యాకేజీ ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీలో రివర్ క్రూజ్ కూడా కవర్ అవుతుంది. ఈ టూర్ ప్యాకేజీ కోల్‌కతా నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో బ్యాంకాక్, పట్టాయా లాంటి ప్రాంతాలు కూడా కవర్ అవుతాయి.
2. ఫిబ్రవరి 11న ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభం అవుతుంది. ఇది 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకుల్ని ఫ్లైట్‌లో థాయ్‌ల్యాండ్ తీసుకెళ్లి అక్కడి టూరిస్ట్ స్పాట్స్ చూపించనుంది ఐఆర్సీటీసీ టూరిజం. మరి ఈ టూర్ ప్యాకేజీ ఎలా సాగుతుందో తెలుసుకోండి.
3. ఐఆర్సీటీసీ థాయ్‌ల్యాండ్ టూర్ మొదటి రోజు కోల్‌కతాలో ప్రారంభం అవుతుంది. ఈ ప్యాకేజీ కోల్‌కతా నుంచి కాబట్టి ఇతర ప్రాంతాలకు చెందిన పర్యాటకులు ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకుంటే ముందుగానే కోల్‌కతా చేరుకోవాలి. మొదటి రోజు రాత్రి 9.45 గంటలకు ఫ్లైట్ ఎక్కితే రెండో రోజు తెల్లవారుజామున బ్యాంకాక్ చేరుకుంటారు.
4. ఎయిర్‌పోర్టులో ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి. వీసా ఆన్ అరైవల్ తీసుకోవాలి. అక్కడ్నుంచి టూరిస్ట్ గైడ్ పర్యాటకుల్ని పట్టాయా తీసుకెళ్తారు. పట్టాయాలో హోటల్లో చెకిన్ కావాలి. సాయంత్రం అల్కజార్ షో లేదా టిఫానీ షో చూడొచ్చు. డిన్నర్ తర్వాత రాత్రికి పట్టాయాలో బస చేయాలి.
5. మూడో రోజు పట్టాయా లోకల్ టూర్ ఉంటుంది. కోరల్ ఐల్యాండ్ సందర్శించవచ్చు. సాయంత్రం ఖాళీ సమయంలో షాపింగ్ చేయొచ్చు. ఇండియన్ రెస్టారెంట్లో డిన్నర్ ఉంటుంది. రాత్రికి పట్టాయాలో బస చేయాలి. నాలుగో రోజు పట్టాయా నుంచి బ్యాంకాక్ వెళ్లాలి. రివర్ క్రూజ్ రైడ్ ఎంజాయ్ చేయొచ్చు. డిన్నర్ తర్వాత బ్యాంకాక్‌లోనే బస చేయాలి.
6. ఐదో రోజు బ్యాంకాక్ టూర్ ఉంటుంది. సఫారీ వాల్డ్ టూర్, మెరైన్ పార్క్ చూడొచ్చు. లంచ్ తర్వాత షాపింగ్ కోసం సమయం ఉంటుుంది. రాత్రికి తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. అర్ధరాత్రి 2.55 గంటలకు బయల్దేరితే తెల్లవారుజామున 4 గంటలకు కోల్‌కతా చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
7. ఐఆర్సీటీసీ థాయ్‌ల్యాండ్ టూర్ ప్యాకేజీ ధర చూస్తే ఒకరికి డబుల్, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.48,300, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.56,364 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, హోటల్లో బస, అల్కజార్ షో లేదా టిఫానీ షో, కోరల్ ఐల్యాండ్ టూర్, రివర్ క్రూజ్, సఫారీ వాల్డ్, మెరైన్ పార్క్, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ లాంటివి కవర్ అవుతాయి. వీసా ఆన్ అరైవల్, ఇతర ఖర్చులు కవర్ కావు.
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.