travelfare.in

  • Temple
    • Temples
  • Toll Plaza
    • Insurance
    • FuelStop
    • Jewelry
  • Contact us
Home » News

Decision to Run TSRTC Bus Services to Odisha | తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం.. కొత్తగా మరో రాష్ట్రానికి సర్వీసులు

February 23, 2023 by harsha Leave a Comment

ఇరు రాష్ట్రాల ప్రజలు ఈ బస్సు సర్వీస్‌లను వినియోగించుకుని, క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు.

Decision to Run TSRTC Bus Services to Odisha

హైదరాబాద్: ఒడిశా (Odisha)కు బస్ సర్వీసులను నడపాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) (TSRTC) నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో 10 బస్సులను తిప్పేందుకు సిద్ధమైంది. ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర బస్‌ సర్వీసుల ఏర్పాటుపై ఒడిశా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఓఎస్ఆర్టీసీ)తో టీఎస్ఆర్టీసీ ఒక ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ బస్ భవన్‌ (Hyderabad Bus Bhawan)లో జరిగిన కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ సమక్షంలో సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఓఎస్ఆర్టీసీ ఎండీ దిప్తేష్‌ కుమార్‌ పట్నాయక్‌ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. వాటిని పరస్పరం అందజేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం.. టీఎస్‌ఆర్టీసీ 10 బస్సులను ఒడిశాకు.. ఓఎస్‌ఆర్టీసీ 13 సర్వీస్‌లను తెలంగాణకు నడపనుంది.

సర్వీస్‌లు ఇలా..

  • హైదరాబాద్‌-జైపూర్‌ 2, ఖమ్మం-రాయఘఢ 2, భవానిపట్న – విజయవాడ (వయా భద్రాచలం) 2, భద్రాచలం-జైపూర్‌ 4 బస్సు సర్వీసులను టీఎస్‌ఆర్టీసీ నడపనుంది.
  • నవరంగ్‌పూర్‌-హైదరాబాద్‌ 4, జైపూర్‌-హైదరాబాద్‌ 2, భవానిపట్న-విజయవాడ(వయా భద్రాచలం) 2, రాయఘఢ-కరీంనగర్‌ 2, జైపూర్‌-భద్రాచలం 3 బస్సులను ఓఎస్‌ఆర్టీసీ తిప్పనుంది.

తెలంగాణ-ఒడిశా మధ్యలో ప్రయాణికులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ తెలిపారు. డిమాండ్‌ నేపథ్యంలో ఓఎస్‌ఆర్టీసీతో అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించామని, ఆయా మార్గాల్లో 10 బస్సులతో ఒడిశాలో 3378 కిలోమీటర్ల మేర నడపాలని సంస్థ నిర్ణయించిందని తెలిపారు. ఇరు రాష్ట్రాల ప్రజలు ఈ బస్సు సర్వీస్‌లను వినియోగించుకుని, క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు.

టీఎస్‌ఆర్టీసీ తీసుకువచ్చిన పలు కార్యక్రమాలను పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా ఓఎస్‌ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఈ సందర్భంగా వివరించారు. టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని ఓఎస్‌ఆర్టీసీ ఎండీ దిప్తేష్‌ కుమార్‌ పట్నాయక్‌ ప్రశంసించారు. తమ రాష్ట్రంలోనూ వాటిని అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఈ ఒప్పందం వల్ల రెండు సంస్థల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందని తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం 13 బస్సు సర్వీస్‌లతో తెలంగాణలో 2896 కిలోమీటర్ల మేర నడుపుతన్నట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవిందర్, జాయింట్ డైరెక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, వినోద్ కుమార్, సీపీఎం కృష్ణకాంత్‌, సీటీఎం జీవనప్రసాద్‌, సీఎంఈ రఘునాథరావు, ఐటీ చీఫ్‌ ఇంజనీర్‌ రాజశేఖర్‌, సీటీఎం(ఎం అండ్‌ సీ) విజయ్‌ కుమార్‌, బిజినెస్‌ హెడ్‌(లాజిస్టిక్స్‌) సంతోష్‌ కుమార్‌, చీఫ్‌ మేనేజర్‌(ఫైనాన్స్‌) విజయ పుష్ఫతో పాటు ఓఎస్‌ఆర్టీసీ ఓఎస్డీ దీప్తి మహాపాత్రో, ట్రాన్స్‌ఫోర్ట్‌ ప్లానర్‌ సందీప్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Filed Under: News

TSRTC TO RUN 2427 SPECIAL BUSES FOR MAHA SHIVRATRI | రాష్ట్రంలోని శైవక్షేత్రాలకు 2427 ప్రత్యేక బస్సులు

February 18, 2023 by harsha Leave a Comment

ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ అనేక రకాల చర్యలు చేపడుతోంది. రకరకాల ఆఫర్లను ప్రకటిస్తూ ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు డీపోల్లో కొత్తగా సూపర్ లగ్జరీల బస్సులను ప్రవేశపెట్టింది. అంతేకాకుండా పలు పండుగలను.

ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ అనేక రకాల చర్యలు చేపడుతోంది. రకరకాల ఆఫర్లను ప్రకటిస్తూ ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు డీపోల్లో కొత్తగా సూపర్ లగ్జరీల బస్సులను ప్రవేశపెట్టింది. అంతేకాకుండా పలు పండుగలను పురస్కరించుకొని ప్రత్యేక బస్సులను సైతం నడిపించింది. ఈ క్రమంలోనే తాజాగా మహా శివరాత్రి నేపథ్యంలో భారీగా ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది.

ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఏకంగా 2427 ప్రత్యే బస్సులను నడిపించేందుకు తెలంగాణ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 40 శైవక్షేత్రాలకు సర్వీసులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీఎస్‌ఆర్టీసీ ఈ ఏర్పాట్లు చేసింది.

Filed Under: News

Hyderabad: హైదరాబాద్‌లో మరో 10 డబుల్ డెక్కర్ బస్సులు.. ఈ రూట్లలో పరుగులు..!

February 18, 2023 by harsha Leave a Comment

Double Decker Bus: హైదరాబాద్‌లో ఇప్పటికే డబుల్ డెక్కర్ బస్సుల సందడి మొదలైంది. ఈ-ప్రిక్స్ సందర్భంగా మూడు బస్సులను హెచ్ఎండీఏ నడిపింది. ఐతే త్వరలోనే ఆర్టీసీ కూడా 10 బస్సులను తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

HYDERABAD TELANGANA RTC LIKELY TO RUN 10 DOUBLE DECKER BUSES IN HYDERABAD CITY HERE ARE MORE DETAILS

హైదరాబాద్‌లో మరో 10 డబుల్ డెక్కర్ బస్సులను (Double Decker Buses) నడపాలని తెలంగాణ ఆర్టీసీ (TSRTC) ప్రయత్నాలు చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తైనట్లు తెలుస్తోంది.

మెట్రో మార్గం, ఫ్లైఓవర్లు, అండర్ పాస్ నిర్మాణాలు లేని మార్గాల్లో డబుల్ డెక్కర్ బస్సులను నడపాలని ఆర్టీసీ భావిస్తోంది. అందువల్ల కేవలం పరిమిత మార్గాల్లో మాత్రమే ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.

డబుల్ డెక్కర్ బస్సులపై నగరవాసులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్ ఈ-ప్రిక్స్ ఫార్ములా రేసింగ్ సందర్భంగా నగరానికి వచ్చిన ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను చూసేందుకు..వాటిలో ఎక్కేందుకు ఎగబడ్డారు.

ఈ నేపథ్యంలో ఆర్టీసీ కూడా డబుల్ డెక్కర్ బస్సులను తీసుకొస్తే… వాటికి ఆదరణ పెరిగి.. ఆర్టీసీకి కూడా లాభదాయకంగా ఉంటుందని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. ఈ క్రమంలోనే 10 బస్సులను నగర రోడ్లపై తిప్పాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌కు ఇప్పటికే మూడు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు వచ్చాయి. ఫార్ములా ఈ-రేసింగ్ సందర్భంగా వాటిని నగర రోడ్లపై తిప్పారు. ఆ బస్సుల నిర్వహణ బాధ్యతలను హెచ్ఎండీఏ చూసుకుంటోంది. త్వరలోనే వీటిని చారిత్రక, పర్యాటక ప్రాంతాల్లో నడపనున్నారు.

హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్ బస్సులకు చారిత్రక ప్రాధాన్యం ఉంది. నిజాం హయాంలో ప్రారంభమైన సంప్రదాయ డబుల్‌ డెకర్‌ బస్సులు 2003 వరకు హైదరాబాద్‌లో తిరిగాయి. కాలం చెల్లడంతో ఆ తర్వాత పక్కనబెట్టారు. ఐతే నగరవాసుల కోరిక.. మంత్రి కేటీఆర్‌ సూచనల మేరకు.. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ అధికారులు ఆరు ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెకర్‌ బస్సుల కోసం ఆర్డర్‌ ఇచ్చారు.

ఇప్పటికే మూడు బస్సులు నగరానికి చేరుకోగా.. మరో మూడు త్వరలోనే రానున్నాయి. వాటిని టూరిజం కోసం వినియోగించనున్నారు. సాధారణ ప్రయాణికుల కోసం ఆర్టీసీ కూడా 10 డబుల్ డెక్కర్ బస్సులను తీసుకొస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Filed Under: News

Vijayawada Maha Shivaratri 2023 APSRTC | TSRTC Run Special Buses To These Shiva Temples In AP And Telangana

February 18, 2023 by harsha Leave a Comment

Shivaratri Buses: శివభక్తులకు శుభవార్త | ఈ ఆలయాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Maha Shivaratri 2023: శివ భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

భారతీయులు ఎంతో భక్తిశ్రద్దలతో నడుపుకునే పండగల్లో శివరాత్రి ( Maha Shivaratri) ఒకటి. ఈ పండగ రోజు శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతాయి. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏపీఎస్ఆర్టీసీ(APRTC Special Buses) ప్రత్యేక బస్సులను నడుపుతోంది.

ఏపీలోని పలు ప్రాంతాల నుంచి శైవక్షేత్రాలకు 3,800 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. వీటిలో అత్యధికంగా కోటప్పకొండకు 675, శ్రీశైలానికి 650, కడప జిల్లా పొలతలకు 200, పట్టిసీమకు 100 బస్సులు ఏర్పాటు చేసినట్టు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.

ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలేవీ ఉండవని.. సాధారణ ఛార్జీలే ఉంటాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని 101 శైవక్షేత్రాలకు 25 లక్షల మంది వస్తారని అంచనా. ఆలయాల వద్ద అన్ని సౌకర్యాలతో తాత్కాలిక బస్‌స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని.. ఘాట్‌రోడ్లపై నైపుణ్యం కలిగిన డ్రైవర్లతో బస్సుల నడుపుతున్నామని పేర్కొన్నారు.

శ్రీశైలం వెళ్లే అన్ని APSRTC బస్సు సర్వీసులకు ప్రయాణ టిక్కెట్లుతో పాటు శ్రీశైలం భ్రమరాంబమల్లికార్జునస్వామి వారి ఆలయ స్పర్శదర్శనం,అతిశీఘ్రదర్శనం, శీఘ్రదర్శనం టిక్కెట్లు కూడా ముందుగానే బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కూడా ఆర్టీసీ కల్పిస్తోంది.

అటు తెలంగాణ ఆర్టీసీ కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 40 శైవక్షేత్రాలకు సర్వీసులు నడపుతోంది. ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు 2,437 బస్సులను తిప్పుతున్నారు. శ్రీశైలానికి 578, ఏడుపాయలకు 497, వేములవాడకు 481, కీసరగుట్టకు 239, వేలాలకు 108, కాళేశ్వరానికి 71, కొమురవెల్లికి 52, రామప్పకు 16 బస్సులను కేటాయించింది.

Filed Under: News

Nagar Kurnool: శివ స్వాములకు ఆటంకంగా మారిన బోటు యజమానులు గొడవలు

February 18, 2023 by harsha Leave a Comment

Telangana: శివరాత్రి వేళ శ్రీశైల క్షేత్రంలోని మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు శివ స్వాములు పాదయాత్రలుగా శ్రీశైలం శిఖరానికి చేరుకుంటారు. ఈ పాదయాత్ర నడక నల్లమల అడవి ప్రాంతాల గుండా కొనసాగుతూ ఉంటుంది.

NAGAR KURNOOL BOAT OWNERS WHO HAVE BECOME A HINDRANCE TO SHIVA SWAM ARE FIGHTING TELANGANA

nagar-kurnool-boat-owners-who-have-become-a-hindrance-to-shiva-swam-are-fighting-telangana

శివరాత్రి వేళ శ్రీశైల క్షేత్రంలోని మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు శివ స్వాములు పాదయాత్రలుగా శ్రీశైలం శిఖరానికి చేరుకుంటారు. ఈ పాదయాత్ర నడక నల్లమల అడవి ప్రాంతాల గుండా కొనసాగుతూ ఉంటుంది. మహబూబ్నగర్ ప్రాంతం నుంచి వచ్చేటువంటి భక్తులు నాగర్ కర్నూల్ అచ్చంపేట వంటి ప్రాంతాల మీదగా నల్లమల అటవీ ప్రాంతంలో ప్రయాణం చేసి శ్రీశైలానికి చేరుకుంటారు. కొత్తకోట, మక్తల్, నారాయణపేట ప్రాంతాల నుంచి వచ్చే శివ భక్తులు కొల్లాపూర్ పరిసర ప్రాంతంలో గల కృష్ణా నదిపై పడవల ప్రయాణం చేసి శ్రీశైలం క్షేత్రానికి చేరుకుంటారు. అయితే ఈ ప్రయాణాల్లో అడుగడుగునా శివ స్వాములకు ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి.

తాజాగా కొల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో గల సోమశిల వద్ద కృష్ణా నదిపై మర బోట్ల రాకపోకలు నిలిచిపోవడంతో శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లే స్వాములు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొన్ని చోట్ల యాజమాన్యుల మధ్య ఘర్షణలు చోటు చేసుకోవడంతో రాష్ట్ర సరిహద్దుల్లోనే శివ స్వాములను వదిలేసి వెళుతున్నారు. ఇలాంటి ఘటన తాజాగా చోటుచేసుకుంది. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బోటు యాజమాన్యాల మధ్య గొడవలు శివ స్వాములకు ఆటంకాలుగా మారుతున్నాయి. బంధువులను కలిసేందుకు, ఇతర అవసరాల కోసం ఐదు ప్రాంతాల ప్రజలు మరబోట్ల ద్వారా రాకపోకలు కొనసాగిస్తున్నారు. 1992 సంవత్సరం నుంచి రెండు ప్రాంతాల ప్రజలు బోట్ల ద్వారానే రాకపోకలు కొనసాగుతున్నాయి.

ఈ క్రమంలో పలు ప్రమాదాలు సంభవించినప్పటికీ తప్పనిసరి పరిస్థితిల్లో మరబొట్లద్వారానే ప్రమాదకరం పరిస్థితులను దాటుకుంటూ ప్రయాణాలు చేస్తున్నారు. బోట్లు నడవకుంటే ఇతర ప్రాంతాల ప్రజలు రోడ్డు మార్గం ద్వారా దాదాపు 200 కిలోమీటర్ల మేర ప్రయాణించి గమ్యస్థానాలకు చేర్చుకోవాల్సి ఉంటుంది. సమయం ఎక్కువగా కావడం ఖర్చు ఎక్కువ కావడంతో విధి లేని పరిస్థితుల్లో చాలావరకు బోటు మార్గం ద్వారానే ప్రజలు గమనిస్తానానికి చేరుతున్నారు.

ఆంధ్ర ప్రాంతం వారు అయితే నంద్యాల నుంచి డోర్నకల్, కర్నూల్, అల్లంపూర్, పెబ్బేరు, చిన్నంబావి మీదుగా తెలంగాణ ప్రాంతాల వారు అయితే కొల్లాపూర్ పెంట్లవెల్లి మీదుగా చిన్నంబాయి, పెబ్బేరు, కర్నూలు , నంద్యాల, ఆత్మకూరు తదితర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది. సమయంతో పాటు చార్జీలు తక్కువ కావడంతో ఈ ప్రయాణ మార్గాన్ని ఎంచుచుకుంటున్నారు.

అయితే ప్రతి ఏటా శివ దీక్షలు పూనిన భక్తులు సోమశిల నుంచి సిద్దేశ్వరం మీదగా బోట్ల ద్వారా ఆంధ్ర ప్రాంతానికి చేరుకొని అటు నుంచి కాలినడకన శ్రీశైలం వెళ్లడం ఆనవాయితీ. తాజాగా ఫిబ్రవరి 15న దాదాపు 250 మంది భక్తులు చేరుకొని బోట్ల ద్వారా సిద్దేశ్వర వరకు చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్ర నుంచి బోట్లు భక్తులను అక్కడికి దించి తిరిగి గమనిస్తానానికి చేరుకున్నాయి.

కానీ అక్కడి నుంచి సంగమేశ్వరం వరకు ఆంధ్ర బోట్ల నిర్వాహకులు బోట్ల ద్వారా ప్రయాణికులను చేరవేయకపోవడంతో వారు అక్కడే ఉండి తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇరువు రాష్ట్రాల పోలీసు అధికారులు, ప్రతినిధులు చర్యలు తీసుకోవడంతో ప్రత్యేక బోట్ల ద్వారా గమ్యస్థానానికి చేర్చారు. బోటు నిర్వాహకుల మధ్య ఉన్న సమస్యలను తొలగించి ఇరు రాష్ట్రాల మధ్య నియమ నిబంధనలు కఠినంగా అమలు చేస్తే రాకపోకలు సాగించే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అటువంటి పరిస్థితిలేవి ఏర్పకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది.

Filed Under: News

  • 1
  • 2
  • 3
  • 4
  • Next Page »

Recent Posts

  • KALWAKURTHY BUS STAND Full Information | TSRTC Time Table | Buses Timings | కల్వకుర్తి బస్సు స్టేషన్ పూర్తి సమాచారం
  • YADADRI NEW BUS STAND TIME TABLE | Yadagiri Gutta New TSRTC Bus Station, Telangana | యాదాద్రి బస్సు స్టేషన్ పూర్తి సమాచారం
  • KADAPA to RAYACHOTI EXPRESS BUS DETAILS | APSRTC Service Number : 6255 Time Table
  • APSRTC Decided to Buy 2736 New Buses | ఏపీఎస్ఆర్టీసీ తమ ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త తెలిపింది | Full Information
  • RGIA to JAGITYAL Buses Time Table | Ticket Fare | TSRTC Bus Timings

Categories

Pages

  • About us
  • Contact us
  • Most Popular Articles | Top views articles | Most Visited Posts | People like Topics
  • Privacy Policy
  • Sample Page
  • Tamil Nadu State Transport Corporation Ltd (TNSTC) Bus Help
  • TravelFare.In | Travelling Planning | Trip Cost Calculation | RTC Buses




Copyright © 2023 · TravelFare.in