travelfare.in

  • Temple
    • Temples
  • Toll Plaza
    • Insurance
    • FuelStop
    • Jewelry
  • Contact us
Home » Road

బెంగళూరు-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే: మేఘా ఇంజినీరింగ్ మరియు KNR కన్స్ట్రక్షన్స్ ఆంధ్రప్రదేశ్‌లోని గ్రీన్‌ఫీల్డ్ విభాగాలకు ఐదు ప్యాకేజీలను గెలుచుకున్నాయి

March 4, 2023 by harsha Leave a Comment

బెంగళూరు-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే, రూ. 19,200 కోట్ల వ్యయంతో 14 ప్యాకేజీల ద్వారా అమలు చేయబడుతుంది మరియు గ్రీన్‌ఫీల్డ్ అలైన్‌మెంట్ మరియు బ్రౌన్‌ఫీల్డ్ అప్‌గ్రేడ్‌ల కలయికగా పరిగణించబడుతుంది.

Bengaluru-Vijayawada Expressway: Megha Engineering And KNR Constructions Win Five Packages For Greenfield Sections In Andhra Pradesh

Bengaluru-Vijayawada Expressway

ప్రస్తుత మార్గం 650 కి.మీల దూరం ప్రయాణిస్తుంది మరియు విజయవాడ మరియు బెంగళూరు మధ్య ప్రయాణించడానికి సుమారు 12 గంటలు పడుతుంది, ప్రతిపాదిత BKV ఎక్స్‌ప్రెస్‌వే రెండు నగరాల మధ్య ప్రయాణించడానికి పట్టే సమయాన్ని దాదాపు ఆరు గంటలకు తగ్గిస్తుంది.

మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) మరియు KNR కన్‌స్ట్రక్షన్‌లు 518 కి.మీ పొడవు, ఆరు లేన్‌లు, యాక్సెస్-నియంత్రిత బెంగళూరు నుండి విజయవాడ ఎక్స్‌ప్రెస్ వే, ఆంధ్రప్రదేశ్‌లోని గ్రీన్‌ఫీల్డ్ విభాగాలపై ఐదు ప్యాకేజీలను అందజేయాలి.

డిసెంబర్ 2022లో, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) మోడల్‌లో ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్ట్ కోసం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) బిడ్‌లను ఆహ్వానించింది.

Filed Under: Road

గ్రామాల్లో రీసైక్లింగ్‌ రోడ్లు.. సేకరించే ప్లాస్టిక్‌ చెత్తతో రహదారులు | Recycling Roads Andhra Pradesh Villages

February 20, 2023 by harsha Leave a Comment

గ్రామీణ సడక్‌ యోజన రోడ్ల నిర్మాణంలోనూ వినియోగం

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కో రీసైక్లింగ్‌ యూనిట్‌ ఏర్పాటు

160 నియోజకవర్గాల్లో 160 గ్రామాల ఎంపిక ఇప్పటికే పూర్తి 

ఇప్పటికే గ్రామాల్లో 232 టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాల సేకరణ

recycling-roads-andhra-pradesh-villages

గ్రామాల్లో సిమెంట్, తారు రోడ్లను మాత్రమే ఇప్పటివరకు చూశాం. ఇకపై ప్లాస్టిక్‌ రోడ్లనూ చూడబోతున్నాం. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగంపై నిషేధం విధించిన ఏపీ సర్కారు.. ప్లాస్టిక్‌ వ్యర్థాల రీసైక్లింగ్‌పైనా ప్రత్యేక దృష్టి సారించింది. వాడి పారేసిన ప్లాస్టిక్‌ వ్యర్థాలకు అర్థాన్ని.. ప్రయోజనాన్ని చేకూర్చేలా ప్లాస్టిక్‌ రోడ్ల నిర్మాణానికి అనువుగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది. సిమెంట్‌ పరిశ్రమల్లో విని­యోగించే విధంగానూ రీసైక్లింగ్‌ యూనిట్లను సిద్ధం చేస్తోంది.

సాక్షి, అమరావతి: పర్యావరణంతో పాటు భూగర్భ జలాలకు ప్రమాదకరంగా తయారైన ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఎప్పటికప్పుడు సేకరించి.. వాటిని రోడ్ల నిర్మాణంలో ఉపయోగించేలా రీసైక్లింగ్‌ చేసేందుకు పంచాయతీరాజ్‌ శాఖ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. నియోజకవర్గానికి ఒకచోట ఈ తరహా రీసైక్లింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా 160 గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు గ్రామాల ఎంపిక సైతం పూర్తయింది.

పట్టణాల తరహాలో గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రతి ఇంటినుంచీ నేరుగా చెత్త సేకరణ ప్రక్రియను ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇలా సేకరించిన చెత్తను ఆయా గ్రామాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న చెత్త సేకరణ కేంద్రాల (సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ షెడ్ల)లో ప్లాసిక్‌ వ్యర్థాలను ఎప్పటికప్పుడు వేరు చేసి ఉంచుతారు.

గ్రామాల వారీగా ఇలా వేరు చేసిన ప్లాస్టిక్‌ వ్యర్థాలను వారానికి ఒకటి లేదా రెండు విడతలుగా ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ యూనిట్‌కు తరలించేలా ఒక వాహనాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. ప్రతివారం రూట్ల వారీగా ఆ వాహనంతో అన్ని గ్రామాల నుంచి ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్‌ యూనిట్లకు తరలిస్తారు. అనంతరం ప్లాస్టిక్‌ బాటిళ్లు, ఇతర ప్లాస్టిక్‌ వ్యర్థాలను మెషిన్ల సాయంతో బండిల్స్‌ రూపంలో అణచివేసి.. ఆ తర్వాత చిన్నచిన్న ముక్కలు ముక్కలుగా మార్చి నిల్వ చేస్తారు.

రోడ్ల నిర్మాణంలో వినియోగించేలా..
ప్లాస్టిక్‌ బాటిల్స్‌ వంటివి మట్టిలో కలవడానికి కనీసం 240 సంవత్సరాలు పడుతుంది. ఇలాంటి ప్లాస్టిక్‌ వ్యర్థాలు వర్షం నీటిని భూమిలో ఇంకిపోకుండా అడ్డుపడుతుంటాయి. దీనివల్ల భూగర్భ జలాలు కలుషితమయ్యే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతో పీఎంజీఎస్‌వై (గ్రామీణ సడక్‌ యోజన) కింద చేపట్టే రోడ్ల నిర్మాణంలో కంకరతో పాటు కొంతమేర ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది.

ప్లాస్టిక్‌ కవర్లు వంటి వాటిని సిమెంట్‌ పరిశ్రమలలో మండించడానికి ఉపయోగించేలా ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకటి చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే రీసైక్లింగ్‌ యూనిట్లలో సిద్ధం చేసిన ప్లాస్టిక్‌ వ్యర్థాలను రోడ్ల నిర్మాణంలో ఉపయోగించాల్సి ఉంటుంది.

రీసైక్లింగ్‌ యూనిట్ల ద్వారా రోడ్డ నిర్మించే కాంట్రాక్టర్లకు ఎక్కడికక్కడ ప్లాస్టిక్‌ వ్యర్థాలను విక్రయించే ఆలోచన చేస్తున్నారు. రానున్న రోజుల్లో రోడ్ల నిర్మాణంలో వీటి వాడకం పెరిగే పక్షంలో జిల్లాల వారీగా ప్రత్యేక వేలం కేంద్రాలను ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.

ఇప్పటికే 232 టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాల సేకరణ
పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా 2021 అక్టోబర్‌ నుంచి క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ నినాదంతో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 232 టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించారు. వాటిలో స్థానికంగా అమ్మడానికి వీలున్న వాటిని గ్రామ పంచాయతీల స్ధాయిలోనే చిరు వ్యాపారులకు అమ్మేశారు.

అమ్మకానికి పనికి రాని ప్లాస్టిక్‌ వ్యర్థాలను పర్యావరణానికి హాని కలిగించని రీతిలో నాశనం చేసినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి గ్రామాల్లొ సేకరించే ప్లాస్టిక్‌ వ్యర్థాలను కొత్తగా ఏర్పాటు చేస్తున్న రీసైక్లింగ్‌ యూనిట్ల ద్వారా రోడ్ల నిర్మాణం లేదా సిమెంట్‌ పరిశ్రమలో మండించడానికి ఉపయోగించేలా రీసైక్లింగ్‌ ప్రాసెస్‌ చేయనున్నట్టు పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు వెల్లడించారు.

Filed Under: Road

4,977 CRORE BUDGET PROPOSAL FOR 85 ROAD PROJECTS IN AP | ఏపీలో 85 రహదారి ప్రాజెక్టులకు రూ.4,977 కోట్ల బడ్జెట్‌ ప్రతిపాదన

February 18, 2023 by harsha Leave a Comment

ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టే 85 జాతీయ రహదారులు, రోడ్డు ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణం కోసం కేంద్ర రహదారి రవాణా శాఖ మొత్తం రూ.4,977 కోట్లు కేటాయించింది కేంద్రం. అవేంటో వివరంగా తెలుసుకుందాం.

4,977 CRORE BUDGET PROPOSAL FOR 85 ROAD PROJECTS IN AP

budget-proposal-for-road-in-ap

ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టే 85 జాతీయ రహదారులు, రోడ్డు ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణం కోసం కేంద్ర రహదారి రవాణా శాఖ మొత్తం రూ.4,977 కోట్లు కేటాయించింది.

ఆ శాఖ తాజాగా విడుదల చేసిన డిమాండ్స్‌ ఫర్‌ గ్రాంట్స్‌ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.

ఈ ప్రాజెక్టులకు కేంద్రం 2022 మార్చి వరకు రూ.5,089.98 కోట్లు ఖర్చు పెట్టగా, 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.932.38 కోట్లు ఖర్చు చేసింది.

2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.4,977.28 కోట్లు కేటాయించినట్లు చూపింది.  

ఇందులో ఆధునికీకరణ, మరమ్మతులు, విస్తరణ పనులు ఉన్నాయి.

  • మాలకొండ నుంచి సింగరాయకొండ వరకు ఉన్న ఎన్‌హెచ్‌ 167బి ఆధునికీకరణకు రూ.120.88 కోట్లు

 

  • నాగార్జునసాగర్‌ డ్యాం నుంచి దావులపల్లి సెక్షన్‌లో హెన్‌హెచ్‌ 565కు రూ.146.31 కోట్లు

 

  • దుత్తలూర్‌ నుంచి కావలి మధ్యలో ఉన్న ఎన్‌హెచ్‌ 167బిజికి రూ.144.35 కోట్లు

 

  • భద్రాచలం నుంచి కుంట మధ్య ఎన్‌హెచ్‌ 30కు రూ.100.70 కోట్లు

 

  • సీఎస్‌ పురం నుంచి మాలకొండవరకు ఎన్‌హెచ్‌ 167బికు రూ.100.62 కోట్లు

 

  • రాయచోటి నుంచి వేంపల్లి వరకు ఎన్‌హెచ్‌ 440 విస్తరణకు రూ.143.36 కోట్లు

 

  • ములకలచెరువు నుంచి మదనపల్లె సెక్షన్‌లో హెన్‌హెచ్‌ 42 విస్తరణకు రూ.175.58 కోట్లు

 

  • మాచర్ల నుంచి దాచేపల్లి వరకు ఎన్‌హెచ్‌167ఏడీ మరమ్మతులకు, ఆధునికీకరణకు రూ.102.09 కోట్లు

 

  • గుడివాడ-మచిలీపట్నం, విజయవాడ-భీమవరం మధ్య రెండు ఆర్‌ఓబీల నిర్మాణం, గుడివాడ బైపాస్‌ మరమ్మతులకు రూ.100.22 కోట్లు

ఇచ్చారు అలాగే

 

  • రంపచోడవరం నుంచి కొయ్యూరు మధ్య ఎన్‌హెచ్‌516 నిర్మాణాని కి రూ.190.94 కోట్లు

 

  • తాడిపత్రి-ముద్దనూరు మధ్య ఎన్‌హెచ్‌67 ని నాలుగు లేన్లుగా విస్తరించడానికి రూ.300.40 కోట్లు

 

  • ముదిగుబ్బ-పుట్టపర్తి మధ్య ఎన్‌హెచ్‌ 342 కు రూ.100.72 కోట్లు

 

  • ముద్దనూరు నుంచి బి.కొత్తపల్లి మధ్య ఎన్‌హెచ్‌ 716జి కి రూ.200.13 కోట్లు

 

  • ఎన్‌హెచ్‌716జి ని బి.కొత్తపల్లి జంక్షన్‌ నుంచి గోరంట్ల వరకు విస్తరణ, పునర్నిర్మాణం చేపట్టడానికి రూ.250 కోట్లు

 

  • సోమయాజులపల్లి-డోన్‌ మధ్య ఎన్‌హెచ్‌340బి ఆధునికీకరణ పనులు చేపట్టడానికి రూ.180.73 కోట్లు

 

  • సీతారామపురం-దత్తలూరు మధ్య ఎన్‌హెచ్‌-167 బీజీ విస్తరణకు రూ.120.07 కోట్లు

 

  • పుట్టపర్తి-కోడూరు సెక్షన్‌లో ఎన్‌హెచ్‌342 విస్తరణకు రూ.300 కోట్లు

 

  • నంద్యాల-కర్నూలు/కడప సరిహద్దుల్లో ఉన్న ఎన్‌హెచ్‌ 167కె సెక్షన్‌ ఆధునికీకరణకు రూ.200 కోట్లను ప్రతిపాదించారు.

 

  • మిగిలిన ప్రాజెక్టులకు రూ.100 కోట్లలోపు చొప్పున కేటాయించారు.

If any doubts please comment below.

Filed Under: Road

Prime Minister Modi Inaugurated Largest National Express Highway in Country | From Sohna-Dausa Road

February 13, 2023 by harsha Leave a Comment

దేశంలోనే అతిపెద్ద జాతీయ ఎక్స్ప్రెస్ హైవే ని ప్రధానమంత్రి మోడి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 1386KMs (పదమూడు వందల ఎనభై ఆరు కిలోమీటర్ల) దిల్లీ-ముంబయి ఎక్స్ ప్రెస్ హైవేలో భాగంగా తొలి దశలో నిర్మించిన సోహ్నా – దౌసా రహదారిని ప్రధాని మోదీ ప్రారంభించారు

Delhi-Mumbai-Express-Hiway-Started

దీనివల్ల ఇక మీదట రెండు గంటల్లోనే ఢిల్లీ నుండి జైపూర్ కి చేరుకోవచ్చు. ప్రస్తుతం ఈ ప్రయాణానికి నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతోంది. ఈ ఎనిమిది లైన్ల సోహ్నా – దౌసా 246 కిలోమీటర్ల రహదారిని పది వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో (Rs.10,400/- Crors) ఖర్చుతో నిర్మించారు.

భారత్తో పాటు యావత్ ప్రపంచం నిర్మాణం ముంబై టు ఢిల్లీ ఎక్స్ప్రెస్ హైవే పై ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ప్రపంచంలోనే రికార్డు స్థాయి వేగం తో పూర్తి అవుతున్న హైవే గా పేరొందిన ఈ రహదారి సిద్ధమైతే దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై ప్రస్తుతం ఉన్న దూరం 180 కిలోమీటర్లు మేరా తగ్గుతుంది.

Express-Hiway-Delhi-to-Jaipur

ప్రయాణ సమయం మాత్రం ఇప్పుడున్న 24 గంటల నుంచి 12 గంటలకు అంటే సగానికి తగ్గుతుంది. 2019 మార్చి 9న ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. ఢిల్లీతో పాటు మధ్యలో ఐదు రాష్ట్రాలలో రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర దాటుతూ రహదారి వెళుతోంది. జైపూర్, అజ్మీర్, కోట, ఉదయపూర్, ఇండోర్, ఉజ్జయిని, అహ్మదాబాద్, సూరత్, వడోదర (Kota, Indore, Jaipur, Bhopal, Vadodara and Surat) లాంటి ప్రధాన పట్టణాలను కలుపుతుంది. ఈ రహదారి నిర్మాణం కోసం 5 రాష్ట్రాలలోని 15 వేల హెక్టార్లలో భూమిని సమీకరించారు.

ఈ ఏడాది చివరికల్లా ఈ హైవే పూర్తిగా అందుబాటులోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

Filed Under: Road

Recent Posts

  • KALWAKURTHY BUS STAND Full Information | TSRTC Time Table | Buses Timings | కల్వకుర్తి బస్సు స్టేషన్ పూర్తి సమాచారం
  • YADADRI NEW BUS STAND TIME TABLE | Yadagiri Gutta New TSRTC Bus Station, Telangana | యాదాద్రి బస్సు స్టేషన్ పూర్తి సమాచారం
  • KADAPA to RAYACHOTI EXPRESS BUS DETAILS | APSRTC Service Number : 6255 Time Table
  • APSRTC Decided to Buy 2736 New Buses | ఏపీఎస్ఆర్టీసీ తమ ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త తెలిపింది | Full Information
  • RGIA to JAGITYAL Buses Time Table | Ticket Fare | TSRTC Bus Timings

Categories

Pages

  • About us
  • Contact us
  • Most Popular Articles | Top views articles | Most Visited Posts | People like Topics
  • Privacy Policy
  • Sample Page
  • Tamil Nadu State Transport Corporation Ltd (TNSTC) Bus Help
  • TravelFare.In | Travelling Planning | Trip Cost Calculation | RTC Buses




Copyright © 2023 · TravelFare.in