Apsrtc Non Ac Sleeper Buses వచ్చేశాయి. కొత్త బస్సుల లుక్ అదిరిపోయింది. తొలిసారి స్టార్ లైనర్ బస్సుల్ని తీసుకొచ్చిన ఆర్టీసీ.. కొత్త బస్ ఫోటోను ట్వీట్ చేసింది. 2+1 స్లీపర్ కోచ్.. 30 కుషన్ సాఫ్ట్ బెర్త్‌లు ఉంటాయని బస్సులో ఉన్న సరికొత్త సౌకర్యాల గురించి ప్రస్తావించింది. ఏ, ఏ రూట్లలో ఈ నాన్ ఏసీ స్లీపర్ బస్సుల్ని నడుపుతామన్నది త్వరలోనే క్లారిటీ ఇస్తామని ఏపీఎస్ ఆర్టీసీ చెబుతోంది.
ప్రధానాంశాలు:
ఏపీఎస్ ఆర్టీసీ సరికొత్త సర్వీసులు
నాన్ ఏసీ స్లీపర్ బస్సులు లాంఛ్
ఫోటోను ట్వీట్ చేసిన ఏపీఎస్ ఆర్టీసీ
ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. నాన్ ఏసీ స్లీప్ బస్సుల్ని అందుబాటులోకి తెచ్చింది. ‘స్టార్ లైనర్’ (Star Liner) పేరుతో ఈ సర్వీసులు రోడ్డెక్కనున్నాయి. ఈ మేరకు ఆర్టీసీ ట్వీట్ చేసింది. ఏపీఎస్ ఆర్టీసీ నాన్ ఏసీ స్లీపర్ బస్సు సర్వీసులను లాంఛ్ చేశఆమని.. బ్రాండ్ నేమ్ స్టార్ లైనర్ అంటూ ప్రకటించింది. బస్సులో సౌకర్యాలను కూడా వివరించింది. 2+1 స్లీపర్ కోచ్.. 30 కుషన్ సాఫ్ట్ బెర్త్‌లు ఉంటాయని తెలిపింది. అలాగే ఛార్జింగ్ పోర్ట్స్.. రీడింగ్ లాంప్స్.. లగేజీ ర్యాక్స్.. ఆడియో కోచ్‌గా బస్సు ఉంటుందని తెలిపింది. ఈ బస్సు ఫోటోను తొలిసారి ట్వీట్ చేసింది ఆర్టీసీ. ఈ బస్సులు ఏ, ఏ రూట్లలో నడుస్తాయన్నది త్వరలోనే క్లారిటీ ఇస్తామంటున్నారు.
APSRTC Launched Non AC Sleeper Buses with a Brand Name of STAR LINER (Sleep Travel And Relax)
– 2+1 Sleeper Coach
– 30Soft Cushion Berths with Back Pad.
– Charging Ports
– Reading Lamps
– Luggage Racks for every Berth
– Audio Coach
ఏపీలో తొలిసారి ఈ నాన్ ఏసీ స్లీపర్ బస్సుల్ని అందుబాటులోకి తెచ్చారు. దూరప్రాంత ప్రయాణికుల కోసం ఆర్టీసీ ఈ సర్వీసులను తీసుకొచ్చింది. అంతేకాదు టికెట్ రేట్లు కూడా ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయంటున్నారు. అంతేకాదు ఆర్టీసీ ఈ బస్సు సర్వీసులకు బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా పేరును సూచిస్తే ప్రజల నుంచి సలహాలు కోరింది. అంతేకాదు ఆర్టీసీ మొత్తం 62 స్టార్ లైనర్ బస్సులను నడపాలని భావిస్తోంది. ముందు కొన్ని రూట్లలో బస్సులు నడుపుతారు.. ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తే సర్వీసుల సంఖ్య పెంచుతామంటున్నారు.
మొన్నటి వరకు నాన్ ఏసీ స్లీపర్ బస్సులో కేవలం ప్రైవేట్ ట్రావెల్స్‌లోనే ఉండేవి. కానీ ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యం కోసం ఆలోచించి ఈ నాన్ ఏసీ స్లీపర్ బస్సుల్ని తీసుకొచ్చింది. ఈ సర్వీసులతో ఆర్టీసీకి ప్రయాణికుల నుంచి ఆదరణ పెరుగుతుందని.. అటు ఆదాయం కూడా మెరుగవుతుందని భావిస్తున్నారు. అయితే ఇప్పటికే ఆర్టీసీ స్లీపర్ బస్సుల్ని నడుపుతున్న సంగతి తెలిసిందే. వెన్నెల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా స్లీపర్ బస్సులు కొన్ని రూట్లలో నడుస్తున్నాయి. ఇప్పుడు నాన్ ఏసీ బస్సులు కూడా రోడ్డెక్కబోతున్నాయి.
మరోవైపు ఆర్టీసీ మరో సరికొత్త టూర్ ప్రారంభించింది. ‘మీ ఆదరణే ప్రేరణగా కొనసాగుచున్న APSRTC వారు వినోదం – విజ్ఞానం కొరకు ఆహ్లాదకరమైన మన్యసీమ దర్శిని ప్రారంభిస్తున్నారని తెలియజేయుటకు సంతోషించుచున్నాము. తక్కువ రేట్లకే విహారయాత్ర చేయండి – మధురస్మృతులను పొందండి’అంటూ మన్యసీమ దర్శినిపై ట్వీట్ చేసింది. అంతేకాదు శబరిమలతో పాటూ అరుణాచలంకు కూడా సర్వీసులు ప్రారంభించింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల నుంచి కొత్త సర్వీసులు కూడా ప్రారంభిస్తోంది. అలాగే బస్సుల్లో డిజిటల్ చెల్లింపుల్ని కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే.