మరమ్మతు పనుల కారణంగా గుంటూరు-కాచిగూడ (17251) రైలును నేటి నుంచి ఈ నెల 28 వరకు, కాచిగూడ-గుంటూరు (17252) రైలును రేపటి నుంచి మార్చి 1 వరకు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అలాగే, కాచిగూడ-మెదక్ (07577) రైలును రేపటి నుంచి మార్చి 1వ తేదీ వరకు, మెదక్-కాచిగూడ (07578) రైలును రేపటి నుంచి మార్చి 1 వరకు రద్దు చేస్టున్నట్టు తెలిపింది.
- గుంటూరు-కాచిగూడ రైలు నేటి నుంచి 28 వరకు రద్దు
- కాచిగూడ-మెదక్ రైలు రేపటి నుంచి మార్చి 1 వరకు రద్దు
- సికింద్రాబాద్-గుంటూరు ఎక్స్ప్రెస్ దొనకొండ-గుంటూరు మధ్య రద్దు
- మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేసిన అధికారులు
మరమ్మతు పనులే కారణం
వీటితోపాటు మచిలీపట్టణం-కర్నూలు సిటీ (07067) రైలును 14, 16,18, 21, 23 25, 28 తేదీల్లో, కర్నూలు సిటీ-మచిలీపట్టణం (07068) రైలును 15, 17, 19, 22, 24, 26, మార్చి 1 తేదీల్లో రద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు. గుంటూరు-సికింద్రాబాద్ (17254) ఎక్స్ప్రెస్ రైలును దొనకొండ-గుంటూరు మధ్య పాక్షికంగా రద్దు చేసినట్టు తెలిపారు.
సికింద్రాబాద్-గుంటూరు (17254) ఎక్స్ప్రెస్ రైలు దొనకొండ-గుంటూరు మధ్య ఈ నెల 18 నుంచి 27 వరకు రద్దు చేశారు. గుంటూరు-డోన్(17228) రైలును 12-28, డోన్-గుంటూరు (17227) రైలును 13 నుంచి మార్చి 1వ తేదీ వరకు రద్దు చేశారు. గుంటూరు-తిరుపతి (17261) 19 నుంచి 28 వరకు, తిరుపతి-గుంటూరు (17262) రైలు గుంటూరు-మార్కాపురం స్టేషన్ల మధ్య రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి, సహకరించాలని కోరారు.
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.