దేశంలోనే అతిపెద్ద జాతీయ ఎక్స్ప్రెస్ హైవే ని ప్రధానమంత్రి మోడి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 1386KMs (పదమూడు వందల ఎనభై ఆరు కిలోమీటర్ల) దిల్లీ-ముంబయి ఎక్స్ ప్రెస్ హైవేలో భాగంగా తొలి దశలో నిర్మించిన సోహ్నా – దౌసా రహదారిని ప్రధాని మోదీ ప్రారంభించారు
దీనివల్ల ఇక మీదట రెండు గంటల్లోనే ఢిల్లీ నుండి జైపూర్ కి చేరుకోవచ్చు. ప్రస్తుతం ఈ ప్రయాణానికి నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతోంది. ఈ ఎనిమిది లైన్ల సోహ్నా – దౌసా 246 కిలోమీటర్ల రహదారిని పది వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో (Rs.10,400/- Crors) ఖర్చుతో నిర్మించారు.
భారత్తో పాటు యావత్ ప్రపంచం నిర్మాణం ముంబై టు ఢిల్లీ ఎక్స్ప్రెస్ హైవే పై ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ప్రపంచంలోనే రికార్డు స్థాయి వేగం తో పూర్తి అవుతున్న హైవే గా పేరొందిన ఈ రహదారి సిద్ధమైతే దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై ప్రస్తుతం ఉన్న దూరం 180 కిలోమీటర్లు మేరా తగ్గుతుంది.
ప్రయాణ సమయం మాత్రం ఇప్పుడున్న 24 గంటల నుంచి 12 గంటలకు అంటే సగానికి తగ్గుతుంది. 2019 మార్చి 9న ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. ఢిల్లీతో పాటు మధ్యలో ఐదు రాష్ట్రాలలో రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర దాటుతూ రహదారి వెళుతోంది. జైపూర్, అజ్మీర్, కోట, ఉదయపూర్, ఇండోర్, ఉజ్జయిని, అహ్మదాబాద్, సూరత్, వడోదర (Kota, Indore, Jaipur, Bhopal, Vadodara and Surat) లాంటి ప్రధాన పట్టణాలను కలుపుతుంది. ఈ రహదారి నిర్మాణం కోసం 5 రాష్ట్రాలలోని 15 వేల హెక్టార్లలో భూమిని సమీకరించారు.
ఈ ఏడాది చివరికల్లా ఈ హైవే పూర్తిగా అందుబాటులోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
Leave a Reply