నగర వాసులకు గుడ్ న్యూస్. ఒకప్పుడు సిటీ రోడ్లపై రయ్ రయ్ మంటూ పరుగులు తీసిన డబుల్ డెక్కర్ బస్సులు, మరోసారి భాగ్యనగరం రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి. ఈనెల 11 నుంచి ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్, ప్యారడైజ్, నిజాం కాలేజీ ప్రాంతాల్లో ఈ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 6 ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల కోసం హెచ్ఎండీఏ ఆర్డర్ ఇవ్వగా ప్రస్తుతం 3 బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ బస్సులను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. త్వరలో మిగిలిన 3 బస్సులు కూడా అందుబాటులోకి రానున్నాయి.
నగరంలో మొత్తం డబుల్ డెక్కర్ బస్సులు 20కి పెంచాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. ఒక్కో బస్సును రూ.2.16కోట్లతో కొనుగోలు చేశారు. డ్రైవర్‌తో పాటు మొత్తం 65 మంది ప్రయాణికులకు సీటింగ్ సామర్థ్యం ఉంది. ఒక సారి ఛార్జింగ్ చేస్తే 150 కి.మీ ప్రయాణించవచ్చని, 2 నుంచి 2.5 గంటల్లో పూర్తిగా ఛార్జింగ్ పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. ఈ-బస్సులు పూర్తిగా ఎయిర్ కండీషన్‌తో ఉంటాయి. ముందు వైపు, వెనుక వైపు డోర్లు ఉండగా, ఆటోమెటిక్‌గా పనిచేస్తాయి. బస్సులో కూర్చోని బయటి అందాలను తిలకించేందుకు వీలుగా పై భాగంలో, కింది భాగంలో అత్యధిక భాగం గ్లాస్‌తోనే కప్పి ఉంటుంది. అలాగే, 500 ఎలక్ట్రిక్ బస్సులకుగానూ అశోక్ లేల్యాండ్ అనుబంధ సంస్థ స్విచ్ మొబిలిటీతో టీఎస్ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. వచ్చే ఆరు నెలల్లో ఈ బస్సులు భాగ్యనగర రోడ్లపై చక్కర్లు కొట్టనున్నాయి.
కాగా, గత కొన్ని దశాబ్దాల క్రితం హైదరాబాద్ నగరంలో డబుల్ డెక్కర్ బస్సులు తిరిగిన విషయం తెలిసిందే. మొదట నగరంలో డబుల్ డెక్కర్ బస్సులు 1946లో ఇంట్రడ్యూస్ చేయబడినట్లు, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అందుకు ఆద్యం పోసినట్లు చరిత్ర చెప్తోంది. మొదట్లో చెర్రీ కలర్లో ఉన్న బస్సులు తిరిగేవట. అనంతరం ఏపీఎస్ఆర్టీసీగా మారాక బస్సు కలర్‌ను ఆకుపచ్చ రంగులోకి మార్చారని వినికిడి. ముఖ్యంగా నెహ్రూ జూలాజికల్ పార్క్‌కు వెళ్లే ‘7Z’ బస్సు ఎక్కడానికి పిల్లలు, పెద్దలు పోటీ పడేవారట. ఈ జనరేషన్ పిల్లలకు, పెద్దలకు వీటి గురుంచి తెలియకపోయినా.. పాత జనరేషన్ వారికి మాత్రం ఇవొక తీపి జ్ఞాపకాలు. డబుల్ డెక్కర్ బస్సుల్లో ప్రయాణం ఎలాంటి అనుభూతినిస్తుందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.
Leave a Reply