Telangana: శివరాత్రి వేళ శ్రీశైల క్షేత్రంలోని మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు శివ స్వాములు పాదయాత్రలుగా శ్రీశైలం శిఖరానికి చేరుకుంటారు. ఈ పాదయాత్ర నడక నల్లమల అడవి ప్రాంతాల గుండా కొనసాగుతూ ఉంటుంది.
NAGAR KURNOOL BOAT OWNERS WHO HAVE BECOME A HINDRANCE TO SHIVA SWAM ARE FIGHTING TELANGANA
శివరాత్రి వేళ శ్రీశైల క్షేత్రంలోని మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు శివ స్వాములు పాదయాత్రలుగా శ్రీశైలం శిఖరానికి చేరుకుంటారు. ఈ పాదయాత్ర నడక నల్లమల అడవి ప్రాంతాల గుండా కొనసాగుతూ ఉంటుంది. మహబూబ్నగర్ ప్రాంతం నుంచి వచ్చేటువంటి భక్తులు నాగర్ కర్నూల్ అచ్చంపేట వంటి ప్రాంతాల మీదగా నల్లమల అటవీ ప్రాంతంలో ప్రయాణం చేసి శ్రీశైలానికి చేరుకుంటారు. కొత్తకోట, మక్తల్, నారాయణపేట ప్రాంతాల నుంచి వచ్చే శివ భక్తులు కొల్లాపూర్ పరిసర ప్రాంతంలో గల కృష్ణా నదిపై పడవల ప్రయాణం చేసి శ్రీశైలం క్షేత్రానికి చేరుకుంటారు. అయితే ఈ ప్రయాణాల్లో అడుగడుగునా శివ స్వాములకు ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి.
తాజాగా కొల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో గల సోమశిల వద్ద కృష్ణా నదిపై మర బోట్ల రాకపోకలు నిలిచిపోవడంతో శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లే స్వాములు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొన్ని చోట్ల యాజమాన్యుల మధ్య ఘర్షణలు చోటు చేసుకోవడంతో రాష్ట్ర సరిహద్దుల్లోనే శివ స్వాములను వదిలేసి వెళుతున్నారు. ఇలాంటి ఘటన తాజాగా చోటుచేసుకుంది. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బోటు యాజమాన్యాల మధ్య గొడవలు శివ స్వాములకు ఆటంకాలుగా మారుతున్నాయి. బంధువులను కలిసేందుకు, ఇతర అవసరాల కోసం ఐదు ప్రాంతాల ప్రజలు మరబోట్ల ద్వారా రాకపోకలు కొనసాగిస్తున్నారు. 1992 సంవత్సరం నుంచి రెండు ప్రాంతాల ప్రజలు బోట్ల ద్వారానే రాకపోకలు కొనసాగుతున్నాయి.
ఈ క్రమంలో పలు ప్రమాదాలు సంభవించినప్పటికీ తప్పనిసరి పరిస్థితిల్లో మరబొట్లద్వారానే ప్రమాదకరం పరిస్థితులను దాటుకుంటూ ప్రయాణాలు చేస్తున్నారు. బోట్లు నడవకుంటే ఇతర ప్రాంతాల ప్రజలు రోడ్డు మార్గం ద్వారా దాదాపు 200 కిలోమీటర్ల మేర ప్రయాణించి గమ్యస్థానాలకు చేర్చుకోవాల్సి ఉంటుంది. సమయం ఎక్కువగా కావడం ఖర్చు ఎక్కువ కావడంతో విధి లేని పరిస్థితుల్లో చాలావరకు బోటు మార్గం ద్వారానే ప్రజలు గమనిస్తానానికి చేరుతున్నారు.
ఆంధ్ర ప్రాంతం వారు అయితే నంద్యాల నుంచి డోర్నకల్, కర్నూల్, అల్లంపూర్, పెబ్బేరు, చిన్నంబావి మీదుగా తెలంగాణ ప్రాంతాల వారు అయితే కొల్లాపూర్ పెంట్లవెల్లి మీదుగా చిన్నంబాయి, పెబ్బేరు, కర్నూలు , నంద్యాల, ఆత్మకూరు తదితర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది. సమయంతో పాటు చార్జీలు తక్కువ కావడంతో ఈ ప్రయాణ మార్గాన్ని ఎంచుచుకుంటున్నారు.
అయితే ప్రతి ఏటా శివ దీక్షలు పూనిన భక్తులు సోమశిల నుంచి సిద్దేశ్వరం మీదగా బోట్ల ద్వారా ఆంధ్ర ప్రాంతానికి చేరుకొని అటు నుంచి కాలినడకన శ్రీశైలం వెళ్లడం ఆనవాయితీ. తాజాగా ఫిబ్రవరి 15న దాదాపు 250 మంది భక్తులు చేరుకొని బోట్ల ద్వారా సిద్దేశ్వర వరకు చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్ర నుంచి బోట్లు భక్తులను అక్కడికి దించి తిరిగి గమనిస్తానానికి చేరుకున్నాయి.
కానీ అక్కడి నుంచి సంగమేశ్వరం వరకు ఆంధ్ర బోట్ల నిర్వాహకులు బోట్ల ద్వారా ప్రయాణికులను చేరవేయకపోవడంతో వారు అక్కడే ఉండి తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇరువు రాష్ట్రాల పోలీసు అధికారులు, ప్రతినిధులు చర్యలు తీసుకోవడంతో ప్రత్యేక బోట్ల ద్వారా గమ్యస్థానానికి చేర్చారు. బోటు నిర్వాహకుల మధ్య ఉన్న సమస్యలను తొలగించి ఇరు రాష్ట్రాల మధ్య నియమ నిబంధనలు కఠినంగా అమలు చేస్తే రాకపోకలు సాగించే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అటువంటి పరిస్థితిలేవి ఏర్పకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది.
Leave a Reply