తెలంగాణలో తెలుగుదేశం ప్రచార బాధ్యతలను హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు అప్పగించాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. తెలంగాణ వ్యాప్తంగా పర్యటించనున్న బాలకృష్ణ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు.
తెలంగాణలో తెలుగుదేశం, జనసేన పొత్తుపై క్లారిటీ వచ్చింది. ఏపీతో పాటు తెలంగాణలోనూ రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని తెలుస్తోంది. తెలంగాణలో 32 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే జనసేన ప్రకటించగా… 87 స్థానాల్లో పోటీ చేస్తామని తెలుగుదేశం సోమవారం ప్రకటించింది. దీంతో రెండు పార్టీలు కలిసి మొత్తం తెలంగాణలోని 119 స్థానాలకు పోటీ చేస్తాయని సమాచారం. ఇప్పటికే జనసేన 32 నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను సైతం నియమించింది. ఇక మిగిలిన 87 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను రెడీ చేస్తోంది. తెలుగుదేశం అభ్యర్థుల జాబితాను రాజమండ్రి జైలులో ఉన్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పరిశీలించి ఓకే చేయాల్సి ఉంది. అటు ఏపీలో పొత్తు ప్రకటించిన తెలుగుదేశం, జనసేన.. బీజేపీ కూడా తమతో కలిసి రావాలని భావిస్తున్నాయి. అయితే ఈ అంశంపై బీజేపీ నుంచి ఎలాంటి స్పందన లేదు.
Leave a Reply