TSRTC: Good news for pilgrims.. TSRTC special buses : వసంత పంచమి సందర్భంగా ఈనెల 26న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు టీఎస్ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. పలు ప్రాంతాల నుంచి మెుత్తం 108 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపారు.
ప్రధానాంశాలు:
- వంసత పంచమి సందర్భంగా ప్రత్యేక బస్సులు
- ఈనెల 26న 108 స్పెషల్ బస్సులు
- టీఎస్ఆర్టీసీ వివరాలు వెల్లడి
TSRTC: వసంత పంచమి సందర్భంగా తెలంగాణలోని పుణ్యక్షేత్రాలకు వెళ్లేవారికి టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల 26న పలు జిల్లాల్లో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం మెుత్తం 108 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపారు. నిర్మల్ జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరకు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి 21 బస్సులు, జేబీఎస్ నుంచి 12, నిజామాబాద్ నుంచి 45, హన్మకొండ నుంచి 5, కరీంనగర్ నుంచి 4, జగిత్యాల నుంచి ఒక బస్సును నడపనున్నట్లు తెలిపారు.
మెదక్ జిల్లాలోని వర్గల్ సరస్వతీ ఆలయానికి సికింద్రాబాద్ గురుద్వారా నుంచి ప్రతి అరగంటకో బస్సు నడిచే విధంగా ఏర్పాటు చేసినట్లు టీఎస్ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్ గురుద్వారా నుంచి 10, జేబీఎస్ నుంచి 6, గజ్వేల్ నుంచి 2, సిద్దిపేట నుంచి 2 బస్సులను నడుపుతామన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అదనపు సర్వీసులు పెంచనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ప్రత్యేక బస్సులకు సంబంధించి పూర్తి వివరాలు, అడ్వాన్స్ రిజర్వేషన్స్ కోసం సంస్థ అధికారిక వెబ్ సైట్ www.tsrtconline.in ను సందర్శించాలని ఆర్టీసీ అధికారులు భక్తులకు సూచించారు.
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.
Leave a Reply