Shivaratri Buses: శివభక్తులకు శుభవార్త | ఈ ఆలయాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
Maha Shivaratri 2023: శివ భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
భారతీయులు ఎంతో భక్తిశ్రద్దలతో నడుపుకునే పండగల్లో శివరాత్రి ( Maha Shivaratri) ఒకటి. ఈ పండగ రోజు శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతాయి. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏపీఎస్ఆర్టీసీ(APRTC Special Buses) ప్రత్యేక బస్సులను నడుపుతోంది.
ఏపీలోని పలు ప్రాంతాల నుంచి శైవక్షేత్రాలకు 3,800 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. వీటిలో అత్యధికంగా కోటప్పకొండకు 675, శ్రీశైలానికి 650, కడప జిల్లా పొలతలకు 200, పట్టిసీమకు 100 బస్సులు ఏర్పాటు చేసినట్టు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.
ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలేవీ ఉండవని.. సాధారణ ఛార్జీలే ఉంటాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని 101 శైవక్షేత్రాలకు 25 లక్షల మంది వస్తారని అంచనా. ఆలయాల వద్ద అన్ని సౌకర్యాలతో తాత్కాలిక బస్స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని.. ఘాట్‌రోడ్లపై నైపుణ్యం కలిగిన డ్రైవర్లతో బస్సుల నడుపుతున్నామని పేర్కొన్నారు.
శ్రీశైలం వెళ్లే అన్ని APSRTC బస్సు సర్వీసులకు ప్రయాణ టిక్కెట్లుతో పాటు శ్రీశైలం భ్రమరాంబమల్లికార్జునస్వామి వారి ఆలయ స్పర్శదర్శనం,అతిశీఘ్రదర్శనం, శీఘ్రదర్శనం టిక్కెట్లు కూడా ముందుగానే బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కూడా ఆర్టీసీ కల్పిస్తోంది.
అటు తెలంగాణ ఆర్టీసీ కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 40 శైవక్షేత్రాలకు సర్వీసులు నడపుతోంది. ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు 2,437 బస్సులను తిప్పుతున్నారు. శ్రీశైలానికి 578, ఏడుపాయలకు 497, వేములవాడకు 481, కీసరగుట్టకు 239, వేలాలకు 108, కాళేశ్వరానికి 71, కొమురవెల్లికి 52, రామప్పకు 16 బస్సులను కేటాయించింది.
Leave a Reply