Know How to Get Duplicate Ticket If You Lost Your Train Ticket : ఇప్పుడైతే టెక్నాలజీ బాగా పెరిగి దాదాపుగా అందరూ ఆన్లైన్లో ట్రైన్ టికెట్ బుకింగ్ చేసుకుంటున్నారు గాని, ఒకప్పుడు అందరూ సంబంధిత రైల్వే స్టేషన్లోనే టికెట్ రిజర్వ్ చేసుకొనేవారు.అవును, IRCTC టికెట్ బుకింగ్ సదుపాయంతో ఆన్లైన్లోనే చాలా తేలికగా రైలు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు.
అయినప్పటికీ ఇప్పటికీ రైల్వే స్టేషన్లలో రిజర్వేషన్ కౌంటర్లో రైలు టికెట్లు తీసుకుంటున్నవాళ్లు ఉండనే వుంటున్నారు.ఈ క్రమంలో అలా రిజర్వ్ చేసుకున్న రైలు టికెట్ పోతే ఏంటి పరిస్థితి? జర్నీలో ఫైన్ కట్టక తప్పదా? లేదంటే సంబంధిత సీట్లో కుర్చోనివ్వరా?
లేదంటే దానికి ప్రత్యమ్నాయంగా డూప్లికేట్ ట్రైన్ టికెట్ తీసుకోవచ్చా? అనే సందేహాలు మీకు కలగక మానవు.దీనిపై Indian Railways Rules ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.డూప్లికేట్ ట్రైన్ టికెట్ ఎలా పొందాలో భారతీయ రైల్వే తమ అధికారిక వెబ్సైట్లో వివరించింది.మీరు ఒకవేళ ట్రైన్ టికెట్ పోగొట్టుకున్నట్లయితే మీ పేరుతో టికెట్ కౌంటర్లో లేదా TTE సాయంతో డూప్లికేట్ టికెట్ తీసుకోవచ్చు.
అయితే ఇందుకోసం కాస్త ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందని గుర్తు పెట్టుకోండి.స్లీపర్ లేదా సెకండ్ స్లీపర్ క్లాస్ టికెట్లకు రూ.50 ఛార్జీ, AC కోచ్ టికెట్ అయితే రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.ఒకవేళ రిజర్వేషన్ ఛార్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత డూప్లికేట్ టికెట్ కావాలంటే మొత్తం ఛార్జీలో 50 శాతం చెల్లించాల్సి ఉంటుంది.
టికెట్ కన్ఫామ్ అయిన తర్వాత ట్రైన్ టికెట్ చిరిగిపోతే ఛార్జీలో 25 శాతం చెల్లించి డూప్లికేట్ టికెట్ తీసుకోవచ్చు.
ఇకపోతే ఇక్కడ తెలుసుకోవలసిన మరో విషయం ఏమంటే, వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులకు మాత్రం ఎటువంటి డూప్లికేట్ టికెట్ జారీ చేయరు.రైల్వే ప్రయాణికులకు ఇక్కడ మరో సౌకర్యం కూడా ఉంది.మీరు డూప్లికేట్ టికెట్ తీసుకున్న తర్వాత ఒకవేళ ఒరిజినల్ టికెట్ దొరికితే డూప్లికేట్ టికెట్ కౌంటర్లో డిపాజిట్ చేసి రీఫండ్ తిరిగి తీసుకోవచ్చు.
ఇలా భారతీయ రైల్వేకి సంబంధించి అనేక నియమనిబంధనలు ఉన్నాయి.తరచూ రైల్వే ప్రయాణం చేసేవారు ఇలాంటి రూల్స్ తెలుసుకుంటే జర్నీలో ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉంటారు.
Leave a Reply