బీబీనగర్, ఘట్కేసర్ మధ్య ట్రాక్ పునరుద్ధరణ కావడంతో రైళ్ల రాకపోకలు యధావిధిగా జరుగుతున్నాయి. యుద్ధ ప్రాతిపదికన ట్రాక్ పనులను పూర్తి చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే.
గోదావరి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో బీబీనగర్, ఘట్కేసర్ సెక్షన్ మధ్య రైల్వే ట్రాక్ దెబ్బతినింది. దీనితో ట్రాక్ పనులను సౌత్ సెంట్రల్ రైల్వే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసింది.
పట్టాలు తప్పిన కోచులను సెక్షన్ నుంచి తొలగించి రైల్వే ట్రాక్ పునరుద్ధరణ మరియు ఓవర్ హెడ్ విద్యుత్ సరఫరా పనులను పూర్తి చేశారు దాంతో సికింద్రాబాద్ నుండి కాజీపేట వైపు సాధారణ మార్గంలో సుదూర రైళ్లతో సహా అన్ని రైల్వే సర్వీసులను పునరుద్ధరించామన్నారు రైల్వే అధికారులు.
విశాఖ నుండి హైదరాబాద్ కు వస్తుండగా గోదావరి ఎక్స్ప్రెస్ మేడ్చల్ జిల్లా అంకుశాపురం సర్కిల్లో పట్టాలు తప్పింది నాలుగు భోగీలు పట్టాల నుంచి పక్కకు జరిగాయి దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురి అయ్యారు ఎలాంటి ప్రమాదం లేదని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు ట్రైన్ స్పీడ్ స్లోగా ఉండడంతో ఎలాంటి ప్రాణహాన్ని జరగలేదు గోదావరి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి మరికొన్నింటిని వివిధ రైల్వే స్టేషన్లలో నిలిపి వేశారు.
ఏడు రైలు పూర్తిగా, 12 రైళ్లు పాక్షికంగా రద్దు అయినాయి ఇరువైపులా దూర ప్రాంతాలకు వెళ్ళవలసిన రైళ్లను ఒకే లైన్ పై అనుమతించాల్సి రావడంతో గంటల తరబడి ఆలస్యంగా నడిచాయి దీంతో ఆయా మార్గాలకు వెళ్ళవలసిన ప్రయాణికులు రైళ్లలో మరియు రైల్వే స్టేషన్లో గంటల తరబడి చెక్కుకుపోయారు మొత్తానికి గోదావరి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో మిగతా రైళ్లు పై తీవ్ర ప్రభావం చూపింది ప్రయాణికులు నరకయాదనపడ్డారు.
Leave a Reply