Good news for Srivari devotees : తిరుమల శ్రీవారి భక్తులు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్లైన్ కోటా టికెట్లను ఈనెల 13న విడుదల చేయనుంది. ఉదయం 9 గంటలకు భక్తులకు ఈ టికెట్లను అందుబాటులో…
Special entrance darshan tickets will be released on 13th of the month : తిరుమల శ్రీవారి భక్తులు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్లైన్ కోటా టికెట్లను ఈనెల 13న విడుదల చేయనుంది. ఉదయం 9 గంటలకు భక్తులకు ఈ టికెట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ నెల 22 నుంచి 28 వరకు విడుదల చేయని రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా టికెట్లను సోమవారం విడుదల చేయనుంది. మరోవైపు.. మార్చి నెలకు సంబంధించిన అంగప్రదక్షిణ టోకెన్ల ఈనెల 23 నుంచి 28 వరకు విడుదల చేయని కోటాను ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు టీటీడీ తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని, టికెట్లు తీసుకుని శ్రీవారి దర్శనం చేసుకోవాలని సూచించింది.
కాగా.. అంగప్రదక్షిణం టికెట్లు కావాల్సిన భక్తులు తిరుమలలో నిర్ణయించిన విధంగా సంప్రాదాయాలు పాటించాల్సి ఉంటుంది. శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసిన తర్వాత ముందుగా.. టోకెన్ మీద నిర్ణయించిన ఎంట్రీ ద్వారం వద్దకు వెళ్లాలి. స్వామి వారి సుప్రభాత సేవ ప్రారంభమైన తరువాత ముందుగా స్త్రీలను అనుమతిస్తారు. వారి ప్రదక్షణ పూర్తయ్యాక పురుషులను అనుమతిస్తారు. స్వామి వారి బంగారు వాకిలి ముందు నుంచి సాష్టాంగ నమస్కారం చేస్తూ.. అలాగే శ్రీవారి ప్రాకారం చూట్టూ ప్రదక్షిణ చేస్తూ శ్రీవారి హుండీ వరకు చేరుకోవాలని అధికారులు సూచించారు.
Leave a Reply