కడప కోటిరెడ్డిసర్కిల్(వైఎస్సార్ జిల్లా): కడప నగర శివార్లలోని విమానాశ్రయంలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. ఇటీవల కొత్తగా చేపట్టిన కడప విమానాశ్రయం రన్వే విస్తరణ, ట్యాక్సీ వే, నాలుగు కొత్త ఆఫ్రాన్లు (విమానాల పార్కింగ్) పనులు పూర్తయ్యాయి.
దీంతో ఇక్కడ నైట్ ల్యాండింగ్ అందుబాటులోకి వచ్చింది. విమానాశ్రయం విస్తరణకు అవసరమైన 70 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వేగంగా సేకరించి కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పడంతో అభివృద్ది పనులు శరవేగంగా పూర్తయ్యాయి. ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు ఒనగూరనున్నాయి.
Leave a Reply