నిన్నటి రోజున మంగళగిరి డిపోకు చెందిన 4673 సర్వీసు నంబరు గల బస్సుకు గుంటూరు నుండి శ్రీశైలానికి మరియు సుండిపెంటకు సీట్ నంబర్లు 1.2 రిజర్వేషన్ చేసుకుని మా ఆడపిల్లలు బయలుదేరారు. బస్సు గం.3.30 ని.. లకు గుంటూరులో బయలుదేరి దాదాపు గం.7.15 ని.లు ప్రయాణం జరిపి గం.10.43 ని.లకు శ్రీశైలం చేరింది. అదొక భయంకరమైన ప్రయాణం.
మధ్యలో సుండిపెంట ప్రయాణీకులను రిజర్వేషన్ చేసుకున్న వారిని కూడా బస్సు టైర్ బాగాలేదన్న నెపంతో సుండిపెంటకు పోవడాన్ని తప్పించుకోవడం కోసం సదరు ప్రయాణీకులను దించి వేరే ఆల్ట్రాడీలక్స్ బస్ లో ఎక్కించడం జరిగింది. టైర్ బాగాలేకపోతే సుండిపెంటకు పోలేని బస్సు ఘాట్ లో ప్రయాణం జరిపి శ్రీశైలానికి ఎలా చేరుకుంటుందో సదరు డ్రైవర్ కి APSRTC వారికే తెలియాలి.
ఆడపిల్లలు చదువుకోవడం కోసం శ్రీశైల ప్రాంతం నుండి గుంటూరుకు వచ్చి సెలవుల సందర్భంగా ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు కలసి బస్ లలో ఇంటికి వస్తారు. కాని ఆ ఆడపిల్లలను సుండిపెంటకు పోకుండా తప్పించుకోవడం కోసం బస్ ల నుండి దించి వేరే బస్ లకు ఎక్కించడం ఎంతవరకు సబబు. అసలు పద్దతేనా! భయంకరమైన స్వార్ధంతో ఇలాంటి పనులు చేయడం వలన ఆడపిల్లలు అయోమయానికి గురై టెన్షన్ పడుతూ తమ తల్లిదండ్రులకు ఫోన్ చేయడం వలన వారుకూడా టెన్షన్ కు గురి అవుతారనే ఇంగిత జ్ఞానం కూడా లేని సదరు డ్రైవర్లను దయచేసి ఈ రూట్ కు పంపవద్దు.
ఎక్కడ ఫ్రీ గా పెడితే అక్కడ బస్సులను ఆపుతూ దాదాపు 8గంటలపాటు శ్రీశైలానికి బస్సును నడుపుకుంటూ తీసుకవచ్చి ఆలస్యమైందనే నెపంతో చెక్ పోష్డు ఇవతలి నుండి వచ్చి నేరుగా బస్టాండ్ లో బస్సును ఆపడం మరో కిరాతకమైన చర్య. చెక్ పోష్టు మీదుగా వస్తే బస్సులో ఉన్న ప్రయాణీకులు ముఖ్యంగా ఆడవారు ఆయా సత్రాలకు దగ్గరలో దిగి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది.
నేరుగా బస్టాండ్ కు రావడం వలన కనీసం ఆటోలు కూడా ఆసమయంలో దొరకవు. అంతలేటుగా రావడం వలన సత్రాలలో ఆహారం కూడా దొరకదు. రద్దీ రోజులలో రూములు కూడా కష్టమే. ప్రయాణీకులకు గతి లేక మీ బస్సులు మాత్రం ఎక్కడం లేదని గమనించగలరు. డ్రైవర్లు వ్యక్తిగత స్వార్ధం, స్వలాభముల కోసం పైశాచికంగా ప్రవర్తించకుండా ప్రయాణీకుల శ్రేయస్సు కోసం తాపత్రయపడితే బాగుంటుందని తమరు మీ పరిధిలో పనిచేస్తున్న డ్రైవర్లకు బోధించగలరు.
Leave a Reply