తాజాగా డెమొక్రసీ టైమ్స్ నెట్వర్క్ సంస్థ సర్వే ఫలితాలను వెల్లడించింది. బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని తన సర్వేలో తేల్చింది. అధికార పార్టీకి గతంలో కంటే సీట్లు తగ్గుతాయని అంచనా వేసింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న జరగనున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కోసం సర్వశక్తులు ఒడ్డుతుండగా.. ఈసారి ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలని కాంగ్రెస్ పార్టీ ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. అయితే బీజేపీ, MIM సైతం ఈ ఎన్నికల్లో కీ రోల్ ప్లే చేయనున్నాయి. ఇక సర్వే సంస్థలు ఎన్నికల సర్వేల ఫలితాలను వెల్లడిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తాజాగా డెమొక్రసీ టైమ్స్ నెట్వర్క్ సంస్థ సర్వే ఫలితాలను వెల్లడించింది. బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని తన సర్వేలో తేల్చింది. అధికార పార్టీకి గతంలో కంటే సీట్లు తగ్గుతాయని అంచనా వేసింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్.. వచ్చే ఎన్నికల్లో 67 స్థానాలు గెలుస్తుందని తెలిపింది. ఇక కాంగ్రెస్ భారీగా పంజుకుని 40 సీట్లు సాధిస్తుందని వెల్లడించింది. బీజేపీ, MIM చెరో ఆరు స్థానాల్లో విజయం సాధిస్తాయని అంచనా వేసింది.
నియోజకవర్గాల వారీగా వివరాలు వెల్లడించింది. బీఆర్ఎస్ 41 శాతం ఓట్ షేర్, కాంగ్రెస్ 35 శాతం ఓట్ షేర్ సాధిస్తాయని అంచనా వేసింది. సర్వే ప్రకారం ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ తన పట్టు నిలుపుకుటుందని తేలింది. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు సాధిస్తుందని సర్వే తేల్చింది.
Leave a Reply