ఆంధ్రప్రదేశ్లో చేపట్టే 85 జాతీయ రహదారులు, రోడ్డు ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం కోసం కేంద్ర రహదారి రవాణా శాఖ మొత్తం రూ.4,977 కోట్లు కేటాయించింది కేంద్రం. అవేంటో వివరంగా తెలుసుకుందాం.
4,977 CRORE BUDGET PROPOSAL FOR 85 ROAD PROJECTS IN AP
ఆంధ్రప్రదేశ్లో చేపట్టే 85 జాతీయ రహదారులు, రోడ్డు ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం కోసం కేంద్ర రహదారి రవాణా శాఖ మొత్తం రూ.4,977 కోట్లు కేటాయించింది.
ఆ శాఖ తాజాగా విడుదల చేసిన డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.
ఈ ప్రాజెక్టులకు కేంద్రం 2022 మార్చి వరకు రూ.5,089.98 కోట్లు ఖర్చు పెట్టగా, 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.932.38 కోట్లు ఖర్చు చేసింది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.4,977.28 కోట్లు కేటాయించినట్లు చూపింది.
ఇందులో ఆధునికీకరణ, మరమ్మతులు, విస్తరణ పనులు ఉన్నాయి.
- మాలకొండ నుంచి సింగరాయకొండ వరకు ఉన్న ఎన్హెచ్ 167బి ఆధునికీకరణకు రూ.120.88 కోట్లు
- నాగార్జునసాగర్ డ్యాం నుంచి దావులపల్లి సెక్షన్లో హెన్హెచ్ 565కు రూ.146.31 కోట్లు
- దుత్తలూర్ నుంచి కావలి మధ్యలో ఉన్న ఎన్హెచ్ 167బిజికి రూ.144.35 కోట్లు
- భద్రాచలం నుంచి కుంట మధ్య ఎన్హెచ్ 30కు రూ.100.70 కోట్లు
- సీఎస్ పురం నుంచి మాలకొండవరకు ఎన్హెచ్ 167బికు రూ.100.62 కోట్లు
- రాయచోటి నుంచి వేంపల్లి వరకు ఎన్హెచ్ 440 విస్తరణకు రూ.143.36 కోట్లు
- ములకలచెరువు నుంచి మదనపల్లె సెక్షన్లో హెన్హెచ్ 42 విస్తరణకు రూ.175.58 కోట్లు
- మాచర్ల నుంచి దాచేపల్లి వరకు ఎన్హెచ్167ఏడీ మరమ్మతులకు, ఆధునికీకరణకు రూ.102.09 కోట్లు
- గుడివాడ-మచిలీపట్నం, విజయవాడ-భీమవరం మధ్య రెండు ఆర్ఓబీల నిర్మాణం, గుడివాడ బైపాస్ మరమ్మతులకు రూ.100.22 కోట్లు
ఇచ్చారు అలాగే
- రంపచోడవరం నుంచి కొయ్యూరు మధ్య ఎన్హెచ్516 నిర్మాణాని కి రూ.190.94 కోట్లు
- తాడిపత్రి-ముద్దనూరు మధ్య ఎన్హెచ్67 ని నాలుగు లేన్లుగా విస్తరించడానికి రూ.300.40 కోట్లు
- ముదిగుబ్బ-పుట్టపర్తి మధ్య ఎన్హెచ్ 342 కు రూ.100.72 కోట్లు
- ముద్దనూరు నుంచి బి.కొత్తపల్లి మధ్య ఎన్హెచ్ 716జి కి రూ.200.13 కోట్లు
- ఎన్హెచ్716జి ని బి.కొత్తపల్లి జంక్షన్ నుంచి గోరంట్ల వరకు విస్తరణ, పునర్నిర్మాణం చేపట్టడానికి రూ.250 కోట్లు
- సోమయాజులపల్లి-డోన్ మధ్య ఎన్హెచ్340బి ఆధునికీకరణ పనులు చేపట్టడానికి రూ.180.73 కోట్లు
- సీతారామపురం-దత్తలూరు మధ్య ఎన్హెచ్-167 బీజీ విస్తరణకు రూ.120.07 కోట్లు
- పుట్టపర్తి-కోడూరు సెక్షన్లో ఎన్హెచ్342 విస్తరణకు రూ.300 కోట్లు
- నంద్యాల-కర్నూలు/కడప సరిహద్దుల్లో ఉన్న ఎన్హెచ్ 167కె సెక్షన్ ఆధునికీకరణకు రూ.200 కోట్లను ప్రతిపాదించారు.
- మిగిలిన ప్రాజెక్టులకు రూ.100 కోట్లలోపు చొప్పున కేటాయించారు.
If any doubts please comment below.
Leave a Reply